వేద న్యూస్, ఇల్లందకుంట:
ప్రజాసేవే పరమావధిగా ఇల్లందకుంట మండల పరిధిలోని కనగర్తి గ్రామ సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేసిన రామంచ రాజు ప్రజాక్షేత్రంలో నిలబడి.. ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు.

 
కనగర్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి రామంచ రాజు వెల్లడిస్తున్నారు. ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న ..సమస్యల పరిష్కారానికి గళం వినిపించే చొరవ, ధైర్యం ఉన్న యువ నాయకుడు  ప్రజాప్రతినిధిగా ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ప్రజాశ్రేయస్సుయే తనకు ముఖ్యమని భావించే మనస్తత్వం కలిగిన రామంచ రాజు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నేపథ్యంలో.. గ్రామ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గ్రామ యువత, ప్రజలు తమ తరఫున నిలిచి.. గ్రామ అభివృద్ధిని కాంక్షించే యువకుడు, యువ నాయకుడు అయిన రాజును ను గెలిపిస్తే.. ఆయన గ్రామ ప్రథమ పౌరుడిగా బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తారని రాజు వర్గీయులు అంటున్నారు.

తాను అందరివాడిగా గ్రామ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోరుతూ.. చిత్తశుద్ధితో పని చేస్తానని సర్పంచ్ అభ్యర్థి రామంచ రాజు రాజుపేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో నిత్యం అందుబాటులో ఉంటానని, విద్యావంతుడినైన తాను పలు విషయాలపై అవగాహన కలిగి ఉన్నానని, ముఖ్యంగా గ్రామ పిల్లలకు విద్య విషయమై సరైన మార్గంలో వెళ్లేలా తన వంతుగా పాటుపడతానని హామీనిస్తున్నారు. ప్రజలకు తనను ప్రజలు ఆశీర్వదించి.. ఒకసారి అవకాశమివ్వాలని రాజు కోరుతున్నారు.