వేద న్యూస్, ఓరుగల్లు:
కేటీఆర్ సేన హన్మకొండ అర్బన్ ప్రెసిడెంట్‌గా గబ్బేట కరుణ్ (సిద్దు ) నియమితులయ్యారు. కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మొంగని మనోహర్ ఆదేశాల మేరకు ఆయనకు నియామక పత్రాన్ని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల మంగళవారం అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని నరేశ్ సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్షని వెల్లడించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ సేన హన్మకొండ అర్బన్ ప్రెసిడెంట్ గబ్బేట కరుణ్ (సిద్ధు) మాట్లాడుతూ..
తన తండ్రి తెలంగాణ ఉద్యమ కారుడు అని గుర్తించి, తనపై నమ్మకముంచి తనకు ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు నరేశ్, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయేది కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేటీఆర్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ సర్కారు ఓర్వలేకపోతున్నదని విమర్శించారు.