• ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు
  •  టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి విమర్శ

వేద న్యూస్, జమ్మికుంట:

పాడి కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి వీణవంక సర్పంచ్‌లా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్వగ్రామం వీణవంకలో బీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయని, సింగపూర్ లో ప్రణవ్ కు తక్కువ వచ్చాయని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సిగ్గుచేటు అన్నారు.

హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వచ్చిన ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాకపోవడం చూస్తేనే హుజురాబాద్ ఎమ్మెల్యే మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయిన విషయం అందరికీ అర్థమవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి గెలిచారే తప్ప వేరేది కాదన్నారు. దేశంలో నరేంద్ర మోడీ కూడా రాముని పేరును అడ్డం పెట్టుకొని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

రాముడు గుడి కట్టిన రాష్ట్రంలోనే బీజేపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. 400కు పైగా సీట్లు వస్తాయని చెప్పుకున్న బీజేపీ అధికారం కోసం ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల సహకారం కోరుతుందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం వచ్చిందని, గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో బలపడిందన్నారు. కరీంనగర్ పార్లమెంటులో కూడా బండి సంజయ్ ని చూసి ఎవరు ఓటు వేయలేదని, నరేంద్ర మోడీ రాజకీయంతోనే సంజయ్ గెలిచారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ బాబు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని అన్నారు. ప్రణవ్ బాబు ఎంత సౌమ్యుడో హుజురాబాద్ ప్రజలందరికీ తెలుసుని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి బాధితులున్నారని, తప్ప ప్రణవ్ గారి బాధితులు ఎవరూ లేరన్నారు.

హుజురాబాద్ లో బిజెపి, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కువ పట్టు ఉందని, కాంగ్రెస్ పార్టీ తర్వాతే ఈ రెండు పార్టీలు ఉంటాయన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎక్కువగా ఉన్నప్పటికీ 47 వేల ఓట్లు సాధించడం గొప్పేమి కాదన్నారు. వీణవంకలో 500 ఓట్లు వచ్చింది కూడా కౌశిక్‌రెడ్డిని చూసి కాదని మాజీ సీఎం కేసీఆర్ ,కేటీఆర్, వీణవంకలో బస చేసి మీటింగ్ పెట్టడం వల్లే సాధ్యమైందని వెల్లడించారు. ఇప్పటికైనా చిల్లర పనులు మానుకొని ఓటమికి గల కారణాలను వెతుక్కుంటే మంచిదని హితువు పలికారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు ,కొల్లూరి కిరణ్ కుమార్,వేముల పుష్పలత, సుశీల, ఎర్ర రమేష్,మహేశ్వరి,అఫ్సర్, రామరావు, సుంకరి రమేష్,కుర్ర శ్రీనివాస్,వినోద్,నరసింగం,సూర్య పాల్గొన్నారు.