వేద న్యూస్, కాజీపేట :
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాజీపేట పట్టణం, 63వ డివిజన్లోని వడ్డెర కాలనీ తిలక్ నగర్ రోడ్డులో సోమవారం 25 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ పనులను 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ శ్రీ సయ్యద్ రజాలి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పది సంవత్సరాల నుండి జరగని అభివృద్ధిని చేసి కాజీపేట రూపు రేఖలే మారుస్తున్నారని అన్నారు. నాయిని రాజేందర్ రెడ్డి కి మా డివిజన్ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూన్నామని, ఇంకా కాజీపేట అభివృద్ధి కోసం మా వెన్నంటి ఉండి అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 63వ డివిజన్ అధ్యక్షులు పోగుల సంతోష్, క్రాంతి, భరత్, మహమ్మద్ షబ్బీర్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ బిలాల్(బబ్లు), పోగుల రాకేష్, సయ్యద్ ఆసిఫ్, నర్సింగ్ రావు, శ్రీనివాస్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.