వేద న్యూస్, ఇ ల్లంతకుంట:

ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో మానకొండూర్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు కేటీఆర్ జన్మదిన సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఆదివారం వెంకట్రావుపల్లి గ్రామంలో కేసీఆర్ కిట్ లను తల్లీ బిడ్డలకు అందజేశారు.

అనంతరం మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్ మాట్లాడుతూ మాజీమంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో ఐదు వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ కిట్ల పంపిణీ చేయడం అభినందనీయమనీ తెలిపారు.

కేసీఆర్ కి మంచి పేరు వస్తుందనే రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వడం లేదని , కేసీఆర్ కిట్ లతో మాతాశిశు మరణాలు తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి అని చెప్పారు. కేసీఆర్ కి మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే కాంగ్రేస్ ప్రభుత్వం ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడంలేదన్నారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తోటపెల్లి తిరుపతి , నాయకులు జెట్టి నాగరాజు ,ఐరెడ్డి అఖిల్ రెడ్డి, జెట్టి నవీన్ పోరెడ్డి హరికాంత్ రెడ్డి నర్సింగోజు శ్రవణ్,యాగండ్ల ప్రశాంత్ ఎండ్రా వెంకటేష్,రామగిరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.