BRS Members Manne Krishank And Konatham DileepBRS Members Manne Krishank And Konatham Dileep

వేదన్యూస్ -గచ్చిబౌలి 

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా యావత్త్ దేశాన్ని ఆకర్శించిన వివాదం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఉదాంతం. యూనివర్సిటీ విద్యార్థులు మొక్కవోని ధైర్యంతో పోరాడటంతో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు జోక్యం చేసుకోని ఆ భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టోద్దని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు మరోవైపు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.

అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో పెట్టిన ఇద్దరు విద్యార్థులను భేషరత్ గా వదిలిపెట్టాలని కూడా అదేశాలను జారీ చేశారు. ఇది అంత ఒక ఎత్తు అయితే ఈ వివాదంలో యూనివర్సిటీ విద్యార్థుల తరపున ఆన్ ఫీల్డ్ .. ఆఫ్ ఫీల్డ్ లో బీఆర్ఎస్ శ్రేణులు కోట్లాడారు. సోషల్ మీడియాలో అయితే ఇక ఇరామమే లేదు. అంతగా కోట్లాడారు. దీంతో సోషల్ మీడియాతో ఏఐ ఆధారిత కంటెంటుతో ప్రజలను తప్పుతోవ పట్టించారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోచ్చారు. ఫేక్ కంటెంటు ప్రచారం చేశారని బీఆర్ఎస్ కు చెందిన యువనేత. మాజీ టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ మన్నె క్రిషాంక్. బీఆర్ఎస్ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం లను ఈరోజు ఉదయం పదిగంటలకు గచ్చిబౌలి పీఎస్ కు రావాలని నోటీసులు జారీచేశారు. దీంతో మార్నింగ్ పీఎస్ కు వచ్చిన వీరిద్దర్ని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. మరోవైపు వారికి సంబంధించిన ఇండ్లపై సోధాలు నిర్వహిస్తున్నారని సమాచారం.