వేద న్యూస్, చొప్పదండి:
పట్టణంలోని గీత విద్యాలయం పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాల డైరెక్టర్ లింగారావు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి మార్గదర్శకంగా ఉపదేశించిన మాటలలో కొన్నింటిని.. ధర్మ నిర్వహణ, ధర్మం, జ్ఞానం మొదలైన విషయాల గురించి చెప్పారు. ప్రతి ఒక్కరూ అదే మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో చైర్మన్ ఆనంద రెడ్డి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.