వేద న్యూస్, చెన్నూర్:

మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ చెన్నూర్ నియోజక వర్గంలోని మందమర్రి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం శంకుస్థాపన చేశారు. 500 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, 13 వేల గృహాలకు త్రాగు నీరు అందించేందుకు 40 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ (అర్బన్), క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో తొలి విడత 18 కోట్లతో గాంధారి వణం వద్ద 250 ఎకరాల్లో నిర్మించే కేసీఆర్ అర్బన్ పార్క్ పార్క్ పనులకు భూమి పూజ చేశారు.

అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. అరవై ఏండ్లు కరెంటు , నీళ్ళు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ఆరు గారెంటీ లు అని ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని, తెలంగాణలో బీజెపీ, కాంగ్రెస్ ప్రజల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, అని బీఆర్ ఎస్ అంటే సాగు నీళ్లు, సంక్షేమం అన్నారు. రైతు బంధు కావాలా ?రాబందు కాంగ్రెస్ కావాలా అని  అడిగారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి సందర్భంగా సీ ఎం కేసీఆర్ బోనస్ ప్రకటించారని , సింగరేణి నీ లాభాల బాటలో నడిపిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే  బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గంలో అరవై ఎండ్ల నుండి ఏ నాయకుడు చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.  కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ భాదవత్, మంచిర్యాల శాసనసభ్యుడు దివాకర్ రావు , బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ప్రజలు పాల్గొన్నారు.