- కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేష్
- తెలంగాణ టీ 10 అండర్ 15 టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ కు చీఫ్ గెస్టు గా హాజరయిన యువ నేత మైనాల
వేద న్యూస్, వరంగల్:
తెలంగాణ టీ 10 అండర్ 15 టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ వరంగల్ వేదికగా శనివారం నిర్వహించారు. దానికి ముఖ్య అతిగా బీ ఆర్ ఎస్ యువ లీడర్, కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా యువ నేత నరేష్ మాట్లాడుతూ క్రీడలు పిల్లలలో మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతగానో తోడ్పడతాయి అని తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు.
కార్యక్రమంలో తెలంగాణ టీ 10 టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ పటేల్,ఆర్గనైజేషన్ సెక్రటరీ రాజుకుమార్, వరుణ్, గీతాంజలి స్కూల్ డైరెక్టర్ సురేష్ కోచ్ లు శ్రీనివాస్,సందీప్,కమలాకర్ తదితరులు పాల్గొన్నారు