వేద న్యూస్, వరంగల్:
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఖిలా వరంగల్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం కేటీఆర్ సేన నేతలు పాలాభిషేకం చేశారు. ఈ ప్రోగ్రామ్ లో కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ ,వరంగల్ తూర్పు నియోజక వర్గ అధ్యక్షుడు ఉదయ్,వరంగల్ అర్బన్ ప్రెసిడెంట్ అశోక్, నరేష్, బాబు మియా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ సేన నాయకుడు నరేశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేధావులు, నిపుణులతో చర్చించిన తర్వాతనే తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారని వెల్లడించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ కోసమే మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసిందని విమర్శించారు.