• రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ ప్రశ్న 

వేద న్యూస్, ఓరుగల్లు:

కాంగ్రెస్ లీడర్లు ఎన్నికలకు ముందు తెలంగాణలో మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామన్నారని, ఇప్పటివరకు ఒక్కొరికి రూ.27,500 ప్రభుత్వం బాకీ పడిందని  కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ యువనేత మైనాల నరేశ్  పేర్కొన్నారు. మహిళాలోకం తరఫున బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను ప్రశ్నిస్తోందని, మహిళలకు రూ.2,500 ఎప్పుడిస్తారో చెప్పాలని నరేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఎన్నికల సమయంలో 10 పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఇప్పుడు కేవలం సన్న వడ్లకే అని అంటోందని మండిపడ్డారు. నిరుద్యోగులు, మహిళలు, పింఛన్ దారులు, ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. పాఠశాలల్లో నాణ్యమైన ఆహారాన్ని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకే స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగి పిల్లలు ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.