వేదన్యూస్ – నాంపల్లి
కరప్షన్ కు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుం. ఫార్ములా ఈ కారు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయం అన్నారు కాంగ్రెస్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ చేయని అవినీతి లేదు.
పదేండ్లలో నలబై వేల ఎకరాలను అమ్మారు. దమ్ముంటే దీనిపై చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ ను హెచ్ సీయూకి లింక్ చేసి మాట్లాడటం దారుణం అని అన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ భూముల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. మిషన్ భగీరథలో అవినీతి. కాళేశ్వరంలో అవినీతి. ప్రాజెక్టుల్లో అవినీతి. పథకాల్లో అవినీతి. అసలు కరప్షన్ కు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్. కేసీఆర్ కుటుంబం అని ఆయన హేద్దేవా చేశారు.