వేద న్యూస్, హన్మకొండ :
కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కోరారు. శనివారం ఆయన వరంగల్, హన్మకొండ బీజేపీ నేతలతో కలిసి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు వినితి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రహరీ నిర్మాణానికి టెండర్ డేట్ ముగిసిన ఇంకా పనులు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. పూర్తి స్థాయి యూనివర్సిటీ భూముల చుట్టూ ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, అధికారులు నిర్లక్ష్యంతో ఆ పేరును చెడగొడుతున్నారన్నారు. యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన అధికారులు కబ్జాదారులకు వంత పాడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. వెంటనే ప్రహరీ నిర్మించాలని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్, రెండు జిల్లాల నాయకులు తీగల భరత్ గౌడ్, కందగట్ల సత్యనారాయణ, చల్లా జైపాల్ రెడ్డి, కనుకుంట్ల రంజిత్, వన్నాల వెంకటరమణ, జన్ను మధు, మార్టిన్ లుథర్, రఘునరెడ్డి, భరత్ వీర్, అరణ్య రెడ్డి, శ్రీరాం రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.