• మిత్రుడి సక్సెస్ పట్ల టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ హ్యాపీ
  •  ‘షరతులు వర్తిస్తాయి’ దర్శకుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బాల్య మిత్రులు  

వేద న్యూస్, జమ్మికుంట:
ఈ శుక్రవారం విడుదల అయిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా మంచి విజయం సొంతం చేసుకొని, విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్బంగా ఆ చిత్ర దర్శకుడిని పదో తరుగతి మిత్రులు హైదరాబాద్ లో సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా మిత్రుల్లో ఒకరైనా జక్కే శ్రీనివాస్ మాట్లాడుతూ తమతో పాటు చదివి ఒక్క మంచి దర్శకుడిగా మంచి సినిమా తీసిన మిత్రుడు ఇంత మంచి విజయం అందుకోవడం తమకు సంతోషంగా ఉందని వెల్లడించారు. అక్షర కుమార్ తమ స్నేహితుడు అయినందుకు చాలా గర్వపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సందీప్, రఘు, సుభాష్, రాజు, వంశీ, రమేష్, శ్రీధర్ మిత్రులు పాల్గొన్నారు.