- కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య
వేద న్యూస్, మరిపెడ:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై సుప్రీంకోర్టు ఆవరణలోనే దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని, ఘటనను ఖండిస్తున్నట్లు కేవీపీఎస్ మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
అత్యున్నతమైన న్యాయస్థానం న్యాయమూర్తి పై బూట్ కాలుతో దాడి చేసే ప్రయత్నం చేయబోయిన న్యాయవాదిని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఆ న్యాయవాది చేత సిజిఏ కు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అందరికీ అన్ని హక్కులు కల్పించిందని, మనువాద భావజాలంతో న్యాయస్థానంలో దాడికి పూనుకోవడం సిగ్గుచేటుఅన్నారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.