వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:

న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే భారత గణతంత్ర దినోత్సవం 2024 ఎన్సిసి కవాతులో ఎల్బీ కాలేజీ ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సర విద్యార్థి బాల జోహార్ పాల్గొంటారని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రధానమంత్రి ర్యాలీలో కూడా జోహార్ పాల్గొంటారని పేర్కొన్నారు. భారత జాతి గర్వించే కొట్లాదిమంది వీక్షించే అరుదైన అవకాశం చిన్న వయసులోనే బాల జోహార్ కు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్, కళాశాల చైర్మన్ నిరంజన్, సెక్రెటరీ ఈ రాజేందర్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. యువత తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అని..కఠోరమైన శిక్షణలో దాదాపు మూడు మాసాల నుండి కఠినమైన శిక్షణలో ఆయుధాలను పట్టుకొని, ఆర్మీ అధికారులచే వరంగల్ గ్రూప్ అధికారులచే ప్రత్యేక అబ్జర్వేషన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ హైదరాబాద్ ప్రత్యేక పర్యవేక్షణలో న్యూఢిల్లీలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్నట్లు స్పష్టం చేశారు.

ఈనెల 26 న ఢిల్లీ ఎర్రకోట కవాత్ లో ఓరుగల్లు సత్తాను చాటడానికి నెలరోజుల నుంచి ఢిల్లీలోనే కఠినమైన శిక్షణ పొందుతున్నట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. లక్షలాదిమంది విద్యార్థులకు దక్కని అరుదైన అవకాశం తమ విద్యార్థికి దక్కడం కళాశాలకు, వరంగల్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పక్షాన ఎర్రకోటలో ఓరుగల్లు సత్తాను చాటడానికి..ప్రతీ సంవత్సరం తన కళాశాల నుండి ఒకరైన వెళ్లడం ఎంతో గర్వకారణం అని చెప్పారు.

వీరి స్ఫూర్తి విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని దేశ సేవ కోసం, దేశ భవిష్యత్తు కోసం యువత చిరుత లాగా తయారు కావాలని అప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఉదాహరణ బాల జోహార్ అని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. వీరికి కఠోరమైన శిక్షణ ద్వారా కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, వరంగల్ గ్రూప్ కమాండర్ కార్నర్ సచిన్ నిమ్బాల్కర్, ఎన్సిసి ఆఫీసర్ ఎల్బి కళాశాల, ఇంతటి అవకాశమిచ్చిన పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ నంద కండూరికి అధ్యాపకులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. కళాశాల నుంచి దాదాపు 75 మంది ఇప్పటివరకు ఢిల్లీ ఎర్రకోట కవాతులో పాల్గొన్నట్లు ఎల్బీ కాలేజీ ప్రిన్సిపాల్ వెల్లడించారు.