వేద న్యూస్, ఆసిఫాబాద్:
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ ను యువకులు జే మహేశ్, ఎస్ విజయ్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్ఐ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ..గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. లాటరీ విధానం, లక్కీ డ్రా వంటి కార్యకలాపాలు పూర్తిగా చట్ట విరుద్ధమని, వీటి ద్వారా అమాయక ప్రజలను చే స్తున్నారని పేర్కొన్నారు.
అక్రమ లాటరీలు లేదా లక్కీ డ్రాలను నిర్వహించే నిర్వాహకులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో లాటరీలు, లక్కీ డ్రా విధానంపై నిషేధం ఉందని, నిబంధనలను ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని, అవసరమైతే పీడి యాక్ట్ (PD Act) నమోదు చేయబడుతుందని హెచ్చరించారు.
