- ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.రాజశేఖర్
- ఘనంగా లైబ్రేరియన్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం
వేద న్యూస్, జమ్మికుంట:
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంటలో శుక్రవారం లైబ్రేరియన్ భీమ్ రావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజశేఖర్ మాట్లాడుతూ 37 సంవత్సరాలు ఉత్తమ గ్రంథ పాలకునిగా భీమారావు సేవలు అందించారని కొనియాడారు. అంతేగాకుండా ఎంతో మంది విద్యార్థులను మంచి పాఠకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకు దక్కిందని వెల్లడించారు.
వైస్ ప్రిన్సిపాల్ ఎడమ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భీమారావు తన 50 ఏండ్ల వయసులో సెట్ (స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్)ఓపెన్ కేటగిరిలో క్వాలిఫై ఎందురికో మార్గదర్శి అయినారని, ఆయన నిత్య విద్యార్థి అని అభినందించారు. స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ ఎం. రామ్మోహన్రావు మాట్లాడుతూ భీమరావు లైబ్రేరియన్‌గా విధులు నిర్వర్తించినా ఆ గ్రంథాలయాన్ని ఉత్తమ గ్రంథాలయంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు నిత్యం పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవారని వివరించారు.
తెలుగు అధ్యాపకులు ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో విజ్ఞాన జిజ్ఞాసను సదా పెంపొందించిన సేవా తత్పరుడు భీమారావు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు పి.డి సుజాత, డాక్టర్ బి.సువర్ణ, డాక్టర్ వి.స్వరూపరాణి, డాక్టర్ ఎంబడి రవి, డాక్టర్ రవి ప్రకాష్, పి. శ్రీనివాస్ రెడ్డి, ఎల్. రవీందర్, ఎన్. మమత, కె. సుధాకర్, ప్రశాంత్ ,సాయి ,అరుణ్ రాజ్ ,కిరణ్, శ్రీనివాస్, అలాగే భీమారావు కుటుంబ సభ్యులు ధర్మపత్ని పద్మ, కుమారుడు అనిరుద్, కోడలు ప్రీతి, నాన్ టీచింగ్ స్టాఫ్ తిరుపతి, రఘు, గౌరమ్మ, మహేందర్, అలాగే బంధువులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు పాల్గొన్నారు.