వేద న్యూస్ , హనుమకొండ:
మంథన్ 2024 -అంతర్జాతీయ సదస్సు మరియు సాంస్కృతిక ఉత్సవం, హైదరాబాద్ లో నవంబర్ 21 నుండి 24 వరకు జరగనుంది. ఇది భారతీయ సాంస్కృతిక ఏకత్వాన్ని ప్రదర్శించే దేశంలోని అతిపెద్ద ఉర్పవంగా ఉంటోంది అని ప్రజ్ఞా ప్రవాహ నేషనల్ కన్వీనర్ జే నంద కుమార్ అన్నారు. లోక్ మంధన్-24 ను పురస్కరించుకొని గురువారం హనుమకొండ బస్ స్టేషన్ సమీపంలోని సామా జగన్మోహన్ మెమోరియల్ హాల్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.
అందులో భాగంగా ప్రజ్ఞాభారతి వరంగల్ విభాగం ప్రి లోక్ మంతన్ పేరిట అవగాహన సదస్సును, ప్రధార కార్యక్రమాన్ని.. సామ జగన్మోహన్ మెమోరియల్ హాల్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నంద కుమార్ మాట్లాడుతూ దేశంలో విశిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు అమల్లో ఉండేవని, విదేశీయుల దండయాత్రల కారణంగా ఆ వ్యవస్థలన్నీ నాశనం చేయబడ్డాయని, గ్రామీణ ప్రజల కంటే పట్టణవాసులు ఉన్నతులుగా భావించే వివక్ష ఏర్పడిందని అన్నారు.
ఈ నేపథ్యంలో గ్రామీణ విజ్ఞానం నిరాదరణకి గురైందని, అందుకే ప్రకృతి జానపదుల గొప్పతనాన్ని లోకానికి చెప్పే లక్ష్యంతోనే ఈ లోక్ మంతన్ జాతీయ సదస్సు భాగ్యనగరంలో నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. జానపదుల విశ్వాసాలు, జీవన విదానం మరియు వేల ఏళ్లుగా సమాజాన్ని ఏలిన వ్యవస్థల వివరాలను వెలికి తీసుకురావాలనేదే ఈ లోక్ మంతన్ ఉద్దేశంఅని తెలిపారు.
లోక్ మంధన్ -24 ఉత్సవాన్ని హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఈ నెల 22 ఉదయం 9:30 ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పద్మ అవార్డు గ్రహీతలు,తెలుగు పండితులు,విద్యా,వ్యాపార వేత్తలు,కళాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో జే. నందకుమార్ , నేషనల్ కన్వీనర్ ప్రజ్ఞా ప్రవాహ, మామిడి గిరిధర్ , వైస్ ప్రెసిడెంట్, ప్రజ్ఞ భారతి తో పాటుగా వరంగల్ ప్రజ్ఞాభారతి అధ్యక్షులు రామ్ గోపాల్ రెడ్డి , చామర్తి ప్రభాకర్ , బుచ్చిబాబు , విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ సంజీవ తదితరులు పాల్గొన్నారు.