వేద న్యూస్, వరంగల్:
కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ మాదాడి రవీందర్ రెడ్డి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేయడంతో పాటు గ్రామంలో ఉన్న యువకుల విద్యా,ఉపాధి అవకాశాల కోసం సొంత ఖర్చులతో ఆయన గ్రంథాలయం నిర్మించారు.
1992 నుండి 1997 వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ గా ఎన్నికై గ్రామంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువల అభివృద్ధికి కృషి చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేశారు. సేవా దృక్పథానికి, మంచికి మారుపేరుగా నిలిచినన మాదాడి రవీందర్ రెడ్డి మృతి గ్రామానికి తీరని లోటని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.