- స్థలాన్ని చదును చేయించిన యువనేత ప్రశాంత్
వేద న్యూస్, కరీంనగర్:
తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో అపురూపంగా, ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ప్రాంగణం సిద్ధమైంది. కాంగ్రెస్ యువనేత ప్రశాంత్ పటేల్ మద్దుల గ్రామ పెద్దల సహకారంతో బతుకమ్మ వేదికను సిద్ధం చేశారు.
తన సొంత ఖర్చుతో బ్లేడ్ ట్రాక్టర్ చేత ప్రశాంత్ పటేల్.. మైదానాన్ని లెవల్ చేశారు. బతుకమ్మ ఆడు క్రమంలో మహిళలకు ఇబ్బంది కలగకుండా గడ్డిని ఆదివారం క్లియర్ చేయించారు.
ప్రకృతిని, పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని ప్రశాంత్ పటేల్ మద్దుల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఎంగిలిపూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు మహిళలు ఎంతో ఇష్టంగా పూల సింగిడి ‘బతుకమ్మ’ను ఆడుకుంటారని వివరించారు.