వేద న్యూస్, సినిమా:
సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత దాదాపు 13 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ వస్తోంది. నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోండగా, ఇందుకు సంబంధించిన అప్ డేట్ ను తాజాగా మేకర్స్ ఇచ్చారు.
శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తోండగా, జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ సినిమాను 12 జనవరి, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. తాజాగా ఇచ్చిన అప్ డేట్ లో మహేశ్ బాబు బుగ్గలపై శ్రీలీల ముద్దు పెడుతోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ట్విట్టర్(ఎక్స్) వేదికగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమోను ఈ నెల 11న, టోటల్ సాంగ్ ను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.