- ఖమ్మంలో ఘనంగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు
వేద న్యూస్, ఖమ్మం:
సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన నగర కమిటీ ఆధ్వర్యంలోఖమ్మం లో మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఏసీపీ గణేష్ , కూరపాటి ప్రదీప్ విచ్చేసారు జిల్లా గౌరవ అధ్యక్షులు తోట రంగారావు మాట్లాడుతూ రక్త దానం చేసిన అభిమానులకు ధన్యవాదములు తెలిపారు.
మహేష్ సేన జిల్లా అధ్యక్షులు దేవభక్తిని కిషోర్ బాబు మాట్లాడుతూ మహేష్ బాబు మాకు అప్ప చెప్పిన బాధ్యతలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నగర కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
నగర అధ్యక్షులు మునగాల బాలు మాట్లాడుతూ మహేష్ బాబు జన్మదినం సందర్బంగా తోట దమయంతి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు చీరాల పంపిణి మధ్యాహ్నం 12గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్నదానం నిర్వహించి నట్టు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో నగర కన్వీనర్ పులిపాటి సంపత్ కుమార్ ఉపాధ్యక్షులు బుర్రి మోహనరావు,జిల్లా ఉపాధ్యక్షులు గురుమూర్తి, వెంకన్న, సహాయ కార్యదర్శి గౌతమ్, నంద్యాల నర్సింహారావు, సుధాకర్, యాసం శివ, రఘునాధపాలెం మండల అధ్యక్షులు దుంపటి శ్రావణ్ కుమార్, బానోత్ సిద్ధూ,షేక్ అస్లాం, మంత్రమూర్తి శ్రీ హర్ష,బానోత్ రఘు పాల్గొన్నారు.
