• ఆరె కుల బాంధవులకు సంఘ నాయకులు శ్రీకాంత్ పిలుపు

 వేద న్యూస్, హన్మకొండ/పరకాల:
రేపు (ఫిబ్రవరి 3)న శనివారం హైదరాబాద్ లో  నిర్వహించనున్న ఓబీసీ సాధన సభను విజయవంతం చేయాలని అరె కుల బాంధవులను ఆరె సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు ఉస్నగిరి శ్రీకాంత్ కోరారు. 

శుక్రవారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరె కులానికి ఓబీసీ సర్టిఫికెట్ లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీ సర్టిఫికెట్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగాలలో అవకాశాలు రాకుండా పోతున్నాయన్నారు. ఓబిసి సాధన కోసం హైదరాబాద్ లోని నాచారం రాఘవేంద్ర నగర్ లో ని ఏఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించే ‘‘చలో హైదరాబాద్’’ కార్యక్రమానికి జిల్లా నుండి పెద్ద మొత్తంలో ఆరె కులస్తులు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఆరె కుల బాంధవుల ప్రతీ ఇంటి నుంచి విధిగా ఒక్కరు సభకు హాజరు కావాలని కోరారు.