వేద న్యూస్, కాసిపేట:
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి గ్రామ పంచాయతీ షెడ్యూల్ ఏరియా వివాదం మంగళవారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో వాదనలు కొనసాగాయని, వచ్చే వారంలో తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు కేసును వాదిస్తున్న హైకోర్టు న్యాయవాది వెంటేశ్వర్లు తెలిపారు.రెవెన్యూ రికార్డుల్లో నాన్ షెడ్యూల్ ఏరియాగా ఉంటేను, అధికారులు మల్కెపల్లిని షెడ్యూల్ ఏరియాగా కొనసాగించడం అన్యాయమని గ్రామానికి చెందిన కసాడి శ్రీనివాస్ సహా పలువురు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. సరైన రికార్డులను పరిశీలించి మల్కెపల్లిని నాన్ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించాలని వారు తమ పిటిషన్‌లో కోరారు.కేసుపై వాదనలు పూర్తికావచ్చునని, త్వరలోనే న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వనుందని గ్రామస్తులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.