వేద న్యూస్, వేలేరు:
పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం వేలేరు కు చెందిన దండ సంపత్ రెడ్డి(57) గురువారం తన వ్యవసాయ భూమి వద్ద పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. అక్కడ పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు తరలించగా మార్గ మధ్యలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య అరుణ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.