వేద న్యూస్, మహబూబాబాద్ :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇందిరమ్మ ఇండ్లు’ కార్యక్రమంతో ప్రజల్లో ఆశలు ఉన్నాయి. కాగా, ఆ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి భూమ్మీద కాకుండా ఆకాశంలోకి వెళ్లేందుకు  ప్రయత్నం చేసినట్టుగా, సెల్ టవర్ ఎక్కి మరీ నిరసన తెలిపాడు. 

వివరాల్లోకెళితే.. డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో మరిపెడ మండలానికి చెందిన బాసనపల్లి రాములు అనే వ్యక్తి కి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని మనస్తాపం చెందాడు. ఆదివారం సదరు వ్యక్తి సమీపంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దాంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.