- దాతృత్వాన్ని చాటిన మరిపెడ సీఐ
- షూస్ లేకుండా నడిచే పాఠశాల పిల్లలను చూసి చలించిన ఇన్ స్పెక్టర్
- 130 మంది విద్యార్థులకు సొంత ఖర్చులతో షూస్ వితరణ
- పిల్లల కళ్లలో ఆనందం
- కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లి తండ్రులు,ఉపాధ్యాయులు
వేద న్యూస్, మరి పె డ:
పోలీస్ లు లాఠీలకు పని చెప్తూ దోషుల పట్ల కటినంగా ఉండటమే కాదు..పేదరికాన్ని చూసి చలించే హృదయాన్ని కలిగి ఉంటారని నిరూపించారు మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్..
మరిపెడ మండలం సీతారాం పురం పాఠశాలలో చదివే విద్యార్థులు రోజు షూస్ లేకుండా కాలి పాదాలతో పాఠశాలకు వెళ్తున్నారని సమాచారం అందుకున్న మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్ వెంటనే పాఠశాలకు చేరుకున్నారు.

పేదరికంలో ఉన్న పిల్లలను చూసి చలించిన సీఐ సాబ్ 130 విద్యార్థులకు షూస్ తెప్పించి ఇచ్చి పిల్లల కళ్లలో ఆనందం చూశారు.
పాఠశాలకు చేరుకొని పిల్లల పరిస్థితిని విని షూస్ వితరణ చేసిన సీఐ కి ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లి తండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.