వేద న్యూస్, మరిపెడ:

మహబూబాబాద్ జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్ గేమ్స్ నవంబర్ 20 న జరిగాయి. బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో చదువుతూ ఉన్న విద్యార్థులు నాలుగు ప్రీ మెట్రిక్ విభాగాలలో పాల్గొన్నారు.

కబడ్డీ విభాగంలో బాలికల నుండి లతా, గంగోత్రి, సోనియా, అఫ్రీన్, వెన్నెల, పూజా గౌతమి, ఖోఖో విభాగంలో పూజా సంజన నందిని, అంజలి, కౌసల్యా, వాలీబాల్ విభాగంలో సాహితీ, హేమశ్రీ, అఫ్రీన్ అంజలి, పూజ, కౌసల్య, అథ్లెటిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో నందిని ప్రథమ స్థానం పూజ ద్వితీయ స్థానం పొంది రాష్ట్ర స్థాయికి ఎన్నిక కాబడ్డారు.

బాలుర విభాగంలో ఖోఖో లో భరత్, వాలీబాల్ లో ఆఫ్రిన్, అథ్లెటిక్స్ లో భరత్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు, వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమారి, స్టాఫ్ సెక్రటరీ రామ్మోహన్, హాస్టల్ వార్డెన్లు ఉమా రెడ్డి, ఈశ్వరమ్మ, కేర్ టేకర్ నాని, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.