- జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్
వేద న్యూస్, హుజురాబాద్ :
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంవత్సరాల తరబడి గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత తీవ్ర నిరాశకు లోనవుతున్నారని తెలిపారు.
నోటిఫికేషన్ జాప్యం వల్ల నిరుద్యోగులకు ఏళ్లు గడుస్తున్నాయి తప్ప ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నోటిఫికేషన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి వయోపరిమితి పెంచాలని నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంధ్యేల వెంకన్న, తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర కుమార్, ఎస్ ఎస్ బి ఎం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి సమ్మయ్య, మహమ్మద్ రియాజ్, మొలుగురి కొమురయ్య, తునికి మధుకర్, ముద్దమల్ల శంకర్, ఆకునూరి అచ్యుత్, శ్రీరాముల వెంకటేష్, మటిక సంపత్ తదితరులు పాల్గొన్నారు.