వేద న్యూస్, వరంగల్/కాశీబుగ్గ:

కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో సభ్యులు శనివారం తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాశిబుగ్గ లో బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసేందుకు సహకరించాలని కోరుతూ కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి తరఫున వారు మెమోరండము సమర్పించారు.

ఈ సందర్భంగా  శాసన మండలి డిప్యూటీ చైర్మన్  ప్రకాష్ మాట్లాడుతూ బతుకమ్మ, దసరా ఉత్సవాలకుఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలోదసరా ఉత్సవ సమితి కన్వీనర్ బయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, దసరా పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి బాంబుల కుమార్, రాచర్ల శ్రీనివాస్, మార్త ఆంజనేయులు, గుత్తికొండ నవీన్, ఓం ప్రకాష్ కొలారియా, గోరంటల రాజు, సిద్దుజు శ్రీనివాస్, వేముల నాగరాజు, గణిపాక సుధాకర్, వలుపదాసు గోపి, సిలువేరు థామస్, ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.