వేద న్యూస్, జమ్మికుంట:

మున్సిపల్ పరిధిలోని స్థానిక పాత మార్కెట్ లో ఎం.హెచ్.డి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒకటి, రెండు తేదీలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరుగుతుందని, ఇప్పుడైనా ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుండి నాన్చుతున్న ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కాలేశ్వరపు సాల్మన్ మాదిగ, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్, మాదిగ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు దొడ్డే శ్రీకాంత్, దొడ్డే రాజు, ఎస్ అంజి, గుల్లి అయాన్, దొడ్డే మహేందర్, దొడ్డే రాకేష్, గజ్జల క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.