•  రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్ టౌన్:

వరంగల్ జిల్లాలో రానున్న 72 గంటలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ జిల్లాలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఎంత‌టి భారీ వ‌ర్షాలు వ‌చ్చినా ప్రాణ న‌ష్టం వాటిల్ల‌కుండా చూడాల‌ని ఆదేశాలు జారీ చేశారు. లోత‌ట్టు ప్రాంతాలు, వాగులు, వంక‌ల‌పై వంతెన‌లపై నుంచి రాక‌పోక‌లు లేకుండా చూడాల‌ని మంత్రి సురేఖ సూచించారు. ఎక్క‌డైనా ప్ర‌మాద‌వ‌శాత్తూ చిక్కుకుంటే వారిని త‌క్ష‌ణ‌మే బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చే ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు.

అదే స‌మ‌యంలో జన నష్టం, ప‌శు న‌ష్టం వాటిల్ల‌కుండా చూడాల‌న్నారు. రానున్న 72 గంట‌ల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌నే వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో వరoగల్ ఉమ్మడి జిల్లా క‌లెక్ట‌ర్లకి ఇచిన నివేదిక ఆధారంగా మంత్రి ఆయా జిల్లా ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌నే హెచ్చ‌రిక‌లు ఉన్న ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వాన్ని సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.