- మిడ్ మానేరులో స్పీడ్ బోట్లో ప్రయాణించి..
వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్ధవెల్లి లోని దత్తాత్రేయ స్వామి వారిని శుక్రవారం పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాట్లాడుతూ మిడ్ మానేరు ప్రాజెక్ట్, కావడం వల్ల దత్తాత్రేయ స్వామి ఆలయం చుట్టూ నీరు రావడం వల్ల దత్తాత్రేయ జయంతి రోజు దర్శనం కోసం వచ్చే భక్తులకు బోట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కేవలం జయంతి రోజు మాత్రమే కాకుండా శాశ్వతంగా బోటు ఏర్పాటు చేసేలా ఇరిగేషన్ వద్ద ఫైల్ పెండింగ్లో ఉందన్నారు.
దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం అందరి పైన ఉండాలని స్వామివారిని వేడు కోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాయకత్వంలో రెండు సంవత్సరాల ప్రజా పాలన ప్రభుత్వం లో అనేక సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి దత్తత్రేయ స్వామి ఆశీర్వచనం కావాలన్నారు.
ప్రజాహితం కోరే వారందరిని ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి, అనేక సందర్భాల్లో చెప్తున్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి గ్రామాల్లో కూడా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాట్లాడుతూ దత్తత్రేయా జయంతి సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు గత మూడు రోజులుగా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం తరుపున భక్తలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. మన ప్రాంతం లోని రాజన్న ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రుల, సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
రూ. 150 కోట్లతో రాజన్న, ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు భక్తులందరికీ దత్తత్రేయా స్వామి జయంతి సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.