వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి:
రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని శనివారం రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. మంత్రి కొండా సురేఖ తనకు సొంత సోదరి లాగా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆప్యాయతను వ్యక్తం చేశారు.
అన్న చెల్లెళ్ల,అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.