• నియోజకవర్గ సమస్యలపై వినతి
  •  పలు అభివృద్ధి పనులకు నిధులు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ 

వేద న్యూస్,  పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి:

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.  కురుపాం నియోజకవర్గంలో ఐదు మండలాలలో రహదారులు కోసం నిధులు మంజూరు  చేయాలని, పీఎంజన్మ యోజన పధకం క్రింద టీజీ గ్రామాలకు బోర్స్ మంజూరు  చేయాలని, సెగ్మెంట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న నాడు – నేడు పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. 

భద్రగిరి హాస్పిటల్ లో 100 పడకల కోసం నిధులు ఇవ్వాలని, కుంకి ఏనుగులు కురుపాం నియోజకవర్గానికి త్వరగా పంపించాలని విన్నవించారు. ఏనుగులు వలన నష్ట పోయిన రైతులకు, నష్టపరిహారానికి నిధులు ఇవ్వాలని, ఆశ్రమ పాఠశాలలోను, హాస్టల్ లో ఏఎన్ఎం లు, అలాగే , పీహెచ్సీ , సిహెచ్ సి లలో స్టాఫ్ నర్స్ లను నియమించాలని రిక్వెస్ట్ చేశారు.

పూర్ణపాడు -లాబేసు వంతెన, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని నం.3కి బదులు కొత్త జీవో తెచ్చి గిరిజనులకు ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ పనులు కోసం నిధులు మంజూరు చేయాలని, మహిళా మండలి సభ్యులకు లోన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. సమస్యలపై సీఎం సానుకూలంగా స్వందించి త్వరలో అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు జగదీశ్వరి వెల్లడించారు.