వేద న్యూస్,కాసిపేట:

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, రొట్టెపల్లి గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు వేముల కృష్ణ, ఆత్రం కళావతి కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఓరియంట్ అదానీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్ రావు నాయకత్వంలోనే తాము పోటీలోకి దిగామని వారు పేర్కొన్నారు. ఒక ప్రకటనలో మాట్లాడుతూ తమరిని ఎమ్మెల్యే వినోద్ ప్రకటించారన్న స్థానిక నాయకుల వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, అవి పార్టీ కొరకు కాదు వ్యక్తిగత ప్రమోషన్ కొరకు చేస్తున్న చవకబారు రాజకీయాలని తీవ్రంగా ఎద్దేవా చేశారు. తమ అభిప్రాయం లేకుండా, తమతో చర్చించకుండా ఇతరులు అభ్యర్థులుగా ప్రకటించడం పార్టీ నియమ నిబంధనలను అవమానపరచడమేనని విమర్శించారు.“కాసిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే అది ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలోనే జరిగింది” అని అభ్యర్థులు స్పష్టం చేశారు. అభ్యర్థులు లేక తమ మద్దతుదారుల పేర్లు ప్రకటించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఏకతా, సమన్వయం కోసం పనిచేయాల్సిన సమయములో ఇలాంటి వ్యవహారాలు మంచిది కాదని అన్నారు.స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు అదానీ సిమెంట్ కంపెనీ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ జెండా మండలంలో ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.