వేద న్యూస్, శాయంపేట:

శాయంపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత విశ్వ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మారపల్లి క్రాంతికుమార్ బి ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ దేశానికి భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిన మేధావి బిఆర్ అంబేద్కర్ అని అన్నారు.ఈ దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారానే స్వేచ్ఛ సమానత్వం, హక్కులు లభిస్తున్నాయి కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని అదేవిధంగా ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కావాలని పోరాటం చేసి మనకి ఇచ్చిన మహా మేధావిని వారి ఆలోచనలను అనుసరించాలి, వారు వేసిన బాటలో నడవాలని ఈ సందర్భంగా అన్నారు. తరువాత ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించిన మహనీయులు వారి ఆలోచనలే ఈరోజు రిజర్వేషన్ ఫలితంగా అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, దళిత నాయకులు అరికెళ్ల దేవయ్య, బి ఎస్ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మారపల్లి విజయ్, శాయంపేట మండల అధ్యక్షులు సుధాకర్, దళిత నాయకులు పెండెల రాజు తదితరులు పాల్గొన్నారు.