• కురిక్యాల ఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీరియస్‌
  • ఘటనపై జిల్లా కలెక్టర్, కమిషనర్‌ లతో మాట్లాడిన శాసన సభ్యుడు
  •  ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

 

వేద న్యూస్, గంగాధర:

గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్ అసభ్య ప్రవర్తన కలకలం రేపింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాకూబ్ పాషా అనే అటెండర్ విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ గౌస్ ఆలం లతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకొని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, “పాఠశాలలో ఏడాది కాలంగా వేధింపులు జరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం, వారి నిర్లక్ష్యం పై మండి పడ్డారు. ఈ ఆకృత్యానికి పాల్పడిన అటెండర్‌ను వెంటనే విధుల నుండి తొలగించాలి అని ఈ ఘటనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న వారందరిపై తప్పనిసరి” కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అధికారులను హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. బాధిత విద్యార్థినులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.