- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
వేద న్యూస్, హుస్నాబాద్ :
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఎంపిటిసి, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 4 తో ముగుస్తున్నందున ఇప్పటివరకు పూర్తయిన పనులను ప్రారంభించాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కోరారు.

ఆదివారం అయన మీడియాతో మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, అవి పూర్తయ్యాయని తెలిపారు. అట్టి పూర్తయిన పనులను హుస్నాబాద్ శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే ప్రారంభించి..ప్రజా ప్రయోజనార్థం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.