వేద న్యూస్, ఇల్లంతకుంట:
రోడ్లు బాగు చేయాలి అని మోడల్ స్కూల్ విద్యార్థులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రహీంఖానపేట గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రహీంఖానపేట లో ధర్నా చేశారు.
ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు అక్కేం నాగరాజు మాట్లాడుతూ మండలం లోని రోడ్లు అన్ని కూడా గుంతల మాయంగా మారి రోడ్లు చినుకు పడితే పొలాలను తలపించే విదంగా.. మారి ఎక్కడ గుంత ఉందొ కూడా తెలియడం లేదు అని చెప్పారు అదేవిదంగా మండలం లోని నారెడ్డిపల్లె, తెనుగువని పల్లె, ఇలా చాలా వరకు చిన్న పల్లల్లో రోడ్లు లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని వెల్లడించారు .
అలాగే ఇల్లంతకుంట మండలం లోని పరిసర గ్రామాల నుండి మోడల్ స్కూల్ కి వచ్చే విద్యార్థులు ప్రతి గ్రామంలో గుంతల రోడ్లు ఉన్నాయి అని, ఆటో లో రావాలి అంటేనే భయంగా ఉంది అని వివరించారు. అనంతారం బిక్క వాగు బ్రిడ్జి, అనంతారం నుండి రహీంఖాన్ పేట కు వెళ్లే రోడ్డు చాలా పెద్ద గుంతలు పడి ఆటో, బస్ లు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. ఇటీవల సిరిసిల్ల డిపో కు సంబందించిన బస్ ముందు చక్రాలు ఉడి పోయాయి అని ,పెద్ద ప్రమాదానికి కారణం రోడ్లు బాగా లేకనే అని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారులు స్పందించి.. రోడ్లు బాగు చేయకుంటే రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో మోడల్ స్కూల్ విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు