- ‘గడప గడప’కు తిరిగిన వొడితల పద్మశ్రీ
- కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన
వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ గెలుపు కోసం ఆయన తల్లి పద్మశ్రీ శనివారం ప్రచారం చేశారు. హుజురాబాద్ పట్టణంలోని 5,6, 7, 19,21, 27, 28, 29వ వార్డుల్లో ‘గడప గడప’కు తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజురాబాద్‌తో తమ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి ప్రణవ్ ను హుజురాబాద్ ఎమ్మెల్యేగా ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ఆమె ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో రాబోయేది హస్తం పార్టీ సర్కారేనని ఈ సందర్భంగా ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత , యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.