వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లా దామెర మండల ఎంపీడీవో కల్పన బుధవారం మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలోని చెరువు పూడిక తీత పనులు చేస్తున్న కూలీలతో కలిసి పని ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ కూలీలకు సౌకర్యాలు, కూలీ రేటు, పని వేళలు మొదలవు వాటిపైన అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో రేపటి నుంచి 100 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని తెలిపారు.

ప్రతి గ్రామంలో 50 కుటుంబాలకు వంద రోజులు పని కల్పించాలని చెప్పారు. అనంతరం ఒగ్లాపూర్ లో మంజూరైన దుబాసి రాధాకృష్ణ పౌల్ట్రీ షెడ్ ని ర్మాణాన్ని సందర్శించారు. అలాగే ఒగ్లాపూర్ నర్సరీని పరిశీలించి గ్రామస్తులకు కావలసిన మొక్కలను పెంచి.. వచ్చే వర్షాకాలం లో పంపిణీ చేయాలని సూచించారు.