వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
వరంగల్ లోకసభ సభ్యులు పసునూరి దయాకర్ ప్రథమ పుత్రుడు రోణి భరత్ వివాహం లక్మీ వైష్ణవితో ఘనంగా జరిగింది. హన్మకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్‌లో గురువారం జరిగిన ఈ వివాహ మహోత్సవానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ లోకసభ సభ్యురాలు మాలోతు కవిత హాజరై..నూతన వధూవరులు రోణి భరత్-లక్మీ వైష్ణవికి పుష్పగుచ్ఛమిచ్చి ఆశీర్వదించారు. వరుడు భరత్ తల్లిదండ్రులు పసునూరి దయాకర్-జయవాణి, వధువు వైష్ణవి తల్లి ఎర్ర వసంత కుమారి, వారి కుటుంబ సభ్యులకు ఎంపీలు రవిచంద్ర, కవిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
