వేద న్యూస్, వరంగల్:
“వేద న్యూస్ ” తెలుగు దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది. యంత్రాంగం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకున్నది. “స్వచ్ఛ వరంగల్ ఉట్టి మాటేనా?” శీర్షికన వేద న్యూస్ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన స్టోరీకి స్పందించిన యంత్రాంగం.. వెంటనే ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఉన్న చెత్తను ఆ ప్రదేశం నుంచి తొలగించింది.
ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట గత కొద్ది రోజులుగా పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంగతిని “వేద న్యూస్” తెలుగు దినపత్రిక తన కథనంలో ప్రస్తావించింది. పోలీసు స్టేషన్ కు కూ తవేటు దూరంలో, ప్రధాన కూడలి వద్ద చెత్త ఇబ్బడి ముబ్బడిగా పోగై ఉండటంతో.. నగరవాసులకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, కనీస పట్టింపు లేకుండా ఉండటం సరికాదని పలువురు పేర్కొన్న విషయాన్ని వివరించింది.

ప్రస్తుత వానాకలం నేపథ్యంలో సీజనల్ డిసీజెస్ ముప్పు పొంచి ఉండగా, వెంటనే చెత్తను తొలగించాలని పలువురు కోరారు. ఈ మేరకు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురాగా, పరిష్కారం లభించడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు. “వేద న్యూస్” తెలుగు దినపత్రిక కి కృతజ్ఞతలు తెలిపా రు.
