వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి :
ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 16,19 వార్డు ఖమ్మం రోడ్ పెట్రోల్ బంక్ ఎదురుగా మఘ్ ఫిరా మసీదు వద్ద మాజీ కౌన్సిలర్ జహీర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రంజాన్ మాసంలో 30 రోజులుగా కఠోర ఉపవాస దీక్షలు చేస్తు అల్లాను తలుచుకుంటూ ప్రార్థనలు చేస్తారన్నారు. గతంలో సూర్యాపేట మున్సిపాలిటి 34 వార్డులు ఉన్నప్పుడు 4 సీట్లు జనరల్ రిజర్వేషన్ ఉన్నప్పుడు ముస్లిం లకు కేటాయించిన ఘనత రాంరెడ్డి దామోదర్ రెడ్డిదే అని తెలిపారు. ముస్లింలకు అన్ని రంగాలలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని అన్నారు. మత పెద్దలు ఇమామ్ ముఫ్తి అస్రార్ ఖాన్ కోరిన విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్ పల్లి వద్ద ప్రభుత్వ స్థలంను ముస్లిం బాలికల అరబిక్ పాఠశాలను విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి మాజీ మంత్రి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి తో మాట్లాడి స్ధలం మంజూరు కోసం జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపి రఘువీర్ రెడ్డి లతో మాట్లడి స్థలం కేటాయిస్తామని అన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వ పధకాల అమలులో ముస్లిం సోదరులు నేరుగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ని కలిసి తెలియజేయవచ్చని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.రంజాన్ పండుగ అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో రంజాన్ పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, బైరు శైలేందర్,కుమ్మరి కుంట్ల వేణుగోపాల్,శబరి, గుణగంటి వంశీ, అయూబ్ ఖాన్, నాగుల వాసు, రావుల రాంబాబు, నర్సింగ్ మహేష్,ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.