• ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక

వేద న్యూస్, ముషీరాబాద్:
ముషీరాబాద్ శాసన సభ్యుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలుపొందారు. కాగా, ముఠా గోపాల్ గెలుపు గురించి ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ముందుగానే చెప్పింది. ‘ముషీరాబాద్ గులాబీదే!’ శీర్షికన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనం అక్షరాలా నిజమైంది. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన గోపాల్ సమీప ప్రత్యర్థిపైన విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా హస్తానికి సానుకూల పవనాలు వీచినా ముషీరాబాద్ లో ముఠా గోపాల్ గులాబీ జెండా రెపరెపలాడించారు.