Konidela Nagababu

వేదన్యూస్ -మంగళగిరి

ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. జనసేన సీనియర్ నేత.. కొణిదెల నాగబాబు ఈరోజు బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెల్సిందే.  శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు నాగబాబుతో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు అచ్చెన్నాయుడు, జనసేన నేతలు హాజరయ్యారు. వీరందరి సమక్షం లో నాగబాబు భారత శాసనం ద్వారా నిర్మితమైన భారతరాజ్యంగంపై నిజమైన విధేయత.. విశ్వసాన్ని చూపుతాను. భారత దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతాను.

దేశ సమగ్రతను కాపాడతాను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నాగబాబు తన సతీమణితో సహా ముఖ్య మంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని కల్సి ఆశీర్వాదం తీసుకున్నారు. బాబు నాగబాబుకు శుభా కాంక్షలు తెలియజేశారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని పని చేయాలని సూచించారు.

Konidela Nagababu