- గణేష్ మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి
- నల్లబెల్లి ఎస్ ఐ వి గోవర్ధన్
వేద న్యూస్, నల్లబెల్లి:
నల్లబెల్లి మండలం పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ విగ్రహాలు పెట్టె ప్రతి ఒక నిర్వాహకుల కోసం మంగళవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో నల్లబెల్లి ఎస్సై వి గోవర్ధన్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అందులో తెలిపిన ప్రకారం వివిధ గ్రామాలకు చెందిన చిన్ని పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక గణేష్ మండప నిర్వాహకులకు poli-ceportal.tspolice.gov.in లింకు పై గణేష్, మండపం వివరాలు అన్ని దిగువనా తెలిపిన లింక్ లో నమోదు చేసుకొని ఒక సెట్ జిరాక్స్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని సూచించారు.
సరైన సమాచారం ఇచ్చినచో ఇట్టి మండపలకు పోలీస్ వారు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా .. సరైన భద్రత ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో పూర్తి సమాచారం ఇచ్చి సహకరించగలరు అని ఎస్ఐ వి గోవర్ధన్ సూచించారు.