• తెలంగాణ వచ్చి 11 ఏళ్లు అయినా బోర్డు మారలేదు
  • ఆసుప త్రి బోర్డు చూస్తే ముక్కున వేలేసు కో వాల్సిందే 
  •  నిర్వహణ మర్చిపోయారా? పట్టించుకోవట్లేదా? 

 

వేద న్యూస్, వరంగల్: 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం ఎంతటి మహత్తరమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పోరాటాలు, బలిదానాలు ప్రత్యక్షంగా జనం పోరాటం లో పాల్గొని ఉద్యమం చేయగా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

 

రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గ డిచినా ఇంకా సదరు ప్రభుత్వ ఆసుపత్రి బోర్డుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు ఉండటం గమనార్హం.

 

వరంగల్ ఆటోనగర్ లోని ప్రాంతీయ నేత్ర వైద్యశాల బోర్డుపై “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం” అని రాసి ఉండటం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అగో.. అదేంటి.. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నదా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సదరు ఆసుపత్రి నిర్వాహకులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.